Thursday, March 19, 2026

గ్లోబల్ రెయిన్ స్కూల్స్ కు ఎక్స్ లెన్స్ అవార్డు..

నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 13:కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ స్కూల్స్ కు ఎక్స్ లెన్స్ అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్ హైటెక్స్ లో ఈటీ టెక్ ఎక్స్ 6వ వార్షిక సమావేశంలో అవార్డును స్కూల్స్ కరస్పాడెంట్ మహ్మద్ ఎర్షాద్ అహ్మద్ కు బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ అధినేత బ్రహ్మం అందజేశారు. ఈ సందర్భంగా కరస్పాడెంట్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో క్రమ శిక్షణతో కూడిన విద్య, ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా పిల్లలలో సృజనాత్మకత వెలికితీస్తున్నామని అందుకే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు తమ పాఠశాలకు లభించిందని తెలిపారు. విద్యార్థుల బహు ముఖాభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు. సృజనాత్మకత శక్తికి వెలికితీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యా ప్రమాణాలు, సామాజిక సేవ, వినూత్న బోధనా పద్ధతులు తదితర అంశాలలను పరిగణలోకి తీసుకొని అవార్డు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాడెంట్ మహ్మద్ ఎర్షాద్ అహ్మద్ ను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News