నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 6 చౌడేపల్లి మండలం స్థానిక ప్రాథమిక పాఠశాలలోని భవిత కేంద్రం నందు మండల విద్యాశాఖ అధికారులు కేశవరెడ్డి,తిరుమల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది అందరు మండలంలోని దివ్యాంగ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలు ఆత్మస్థైర్యంతో చదువుకుని ముందుకు వెళ్లాలని తెలియజేశారు,అదేవిధంగా తిరుమల మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే రాయితీలను వినియోగించుకోవాలని తెలియజేశారు,ఆటల పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరత్నమ్మ,ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి, ఐ ఈ డి ఎస్ ఎస్ ఉపాధ్యాయులు అశోక్ కుమార్,భవిత ఉపాధ్యాయులు రామ్మోహన్,నరేష్,రోజా,ఎంఆర్సి సిబ్బంది వసంత,జ్యోతి, లావణ్య,మునస్వామి పాల్గొన్నారు.





