Tuesday, March 10, 2026

ఘనంగా ఆర్టీసీ కండక్టర్ పదవి విరమణ కార్యక్రమం

నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (వీఆర్ ధర్మేంద్ర ):-

స్థానిక కోరుట్ల ఆర్టీసీ డిపోలో 32 సంవత్సరాల సుదీర్ఘకాలం సంస్థకు సేవలు అందించి ఈరోజుతో పదవీ విరమణ చేస్తున్న CITU-SWF కోరుట్ల డిపో కార్యదర్శి M. G. నర్సయ్య గారి పదవి విరమణ కార్యక్రమం డిపోలో ఘనంగా జరిగింది. దీనికి డిపో మేనేజర్, వివిధ స్థాయిల ఆర్టీసీ అధికారుల సహా CITU జగిత్యాల జిల్లా మాజీ కార్యదర్శి G. తిరుపతి నాయక్ గారు, SWF ఉమ్మడి జిల్లా కార్యదర్శి V. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ములుగూరి. రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు విశ్వేశ్వర్ మరియు జగిత్యాల డిపో సెక్రటరీ v. ప్రసాద్, కోశాధికారి K.స్వామి హాజరైనారు.M. G. నర్సయ్య గారు తన సుదీర్ఘ ఉద్యోగ అనుభవంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు , పోరాట స్ఫూర్తితో కుటుంబాన్ని ఉద్యోగాన్ని సమన్వయం చేస్తూ పదవి విరమణ వరకు కూడా ఆరోగ్యంగా ఉండడాన్ని పలువురు కొనియాడారు. శేష జీవితాన్ని విశ్రాంతి కోసం కాకుండా ఓపిక ఉన్నంత వరకు హక్కుల కోసం పోరాటం చేస్తానని వారు సభాముఖంగా తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News