నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 1చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఇంటర్నేషనల్ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ జయప్రకాశ్ అధ్యక్షతన NSS ప్రోగ్రాం ఆఫీసర్ బాలాజీ ఆధ్వర్యం లో ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే ను నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని,యవ్వనం లో క్రమ శిక్షణ తో,నైతిక విలువలు కలిగి ఉండాలని తెలియజేశారు.సెల్ ఫోన్లను విజ్ఞానం మేరకే వినియోగించాలని,అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వివరించారు.ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు,నివారణా చర్యల గురించి తెలియజేశారు.కళాశాల ప్రాంగణం నుండి భారీ ర్యాలీని నిర్వహించారు.మానవ హారం తో చౌడేపల్లి బస్టాండ్ నందు ఎయిడ్స్ వ్యాధి కి సంబంధించిన నినాదాలు చేశారు. అధ్యాపక బృందం,కె సుబ్రహ్మణ్యం, సురేష్, రవి, నౌషద్, ఆదినారాయణ, బాల,పోలీరెడ్డి,డాక్టర్ చంద్ర, ఆశ అనురాధ, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.





