నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 19) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో బుధవారం రోజున మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా మార్కెట్ చైర్మన్ రూప్ల నాయక్ వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఉక్కు మహిళా ఇందిరమ్మ పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చెర్మెన్ ఆరిగే లింగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నంది మేడారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఉత్తెం రాజయ్య, యూత్ అధ్యక్షులు సోగాల తిరుపతి, ఓరేం చిరంజీవి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హమాలీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





