నేటి సాక్షి,నారాయణపేట, జూలై 7,
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ గ్రామంలో సోమవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం 31 సంవత్సరాల విజయోత్సవ ఉత్సవాల సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రామ్మోహన్ తో పాటు ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులు అఖిలపక్ష రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు మొదలగు వారు పాల్గొన్నారు.