Friday, March 13, 2026

ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

నేటి సాక్షి, కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)కోరుట్ల శాసనసభ సభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పుట్టినరోజు వేడుకలను బిఆర్ఎస్ అధికార ప్రతినిధులు, కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించారు.*విద్యార్థులచే ప్రతిజ్ఞ*నా జీవితం, నా ఆరోగ్యం…. నేను, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. మాదకద్రవ్యాలు మనుషుల శరీరాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయని, అందుకే నేను, ఎప్పటికీ మాదకద్రవ్యాలను తాకనని, వాడనని, నా స్నేహితులను కూడా వాటి నుండి దూరంగా ఉండాలని, ఉంచుతనని, మాదకద్రవ్య రహిత సమాజం కోసం తమ వంతు కృషి చేస్తామని…యువత, చెడు వ్యసనాలు వైపు వెళ్లకుండా వివిధ కళాశాలల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.——– *పండ్ల పంపిణీ*పుట్టినరోజు వేడుకలలో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు.———-*ప్రత్యేక పూజలు* డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ ప్రతినిధులు, కార్యకర్తలు కోరుట్ల పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News