నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో మండల అధ్యక్షుడు తూం జలపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీజీకి నివాళులర్పించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తూం జలపతి మాట్లాడుతూ… మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో నిరసన వ్యక్తం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, ఉపా సర్పంచ్ దాసరి అశోక్, రాష్ట్ర ఓబిసి సెల్ జాయింట్ సెక్రెటరీ జక్కు వంశీ, జక్కుల లక్ష్మీ నర్సయ్య, తిక్క భూమయ్య, జక్కు మోహన్, లింగారెడ్డి, నాంచారి రాకేష్, శివానీతుల వెంకటేష్, నాంచారి రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

