నేటి సాక్షి చిలుకూరు:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ దొడ్డ నరసయ్య 27వ వర్ధంతిని చిలుకూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దొడ్డ నరసయ్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం మండల అధ్యక్షుడు.. మండవ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… నాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డ నరసయ్య దలకమాండర్ గా బాధ్యతలు నిర్వహించారని 1941 లో రావినారాయన రెడ్డి అధ్యక్షత న చిలుకూర్ లో జరిగిన ఆంధ్ర మహాసభ కార్యక్రముములో వాలంటీర్ గ పనిచేసిన దొడ్డ నరసయ్య సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితుడై 1942 సవత్సరములో పార్టీ సబ్యత్వం పొంది….నిజాం వ్యతిరేక ఉద్యమం,తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని భూస్వాముల గుండాలు కౌలు పేరుతో చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహా ఉద్యమకారుడు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి షేక్ సాహెబ్ అలీ, దొడ్డ రమేష్, చిలువేరు ఆంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు, పిల్లుట్ల కనకయ్య, కస్తూరి సైదులు, కొండ కోటయ్య కట్టెకోల నాగేశ్వర్ రావు, వడ్డేపల్లి కోటేష్, పోలేబోయిన గంగాధర్, కస్తూరి సత్యం, దొడ్డ నాగేశ్వర్రావు, కొడారు శ్రీను, పిల్లుట్ల కృష్ణయ్య, కట్టెకోల చంద్రయ్య, అనంతుల రాము,కడారు మధు, మల్లెపంగు సూరిబాబు, జాన్ పాషా, కొండలు, దొంతగాని వీరస్వామి, సైదులు,ముత్యాలు , తదితరులు పాల్గొన్నారు.

