Wednesday, March 18, 2026

ఘనంగా చల్ల బాబు జన్మదిన వేడుకలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 19 పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బస్టాండ్ నందు చల్ల రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ప్రారంభించారు.పుంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చల్లా రామచంద్రారెడ్డి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని గువ్వల రమేష్ రెడ్డి అన్నారు సమకాలిన రాజకీయాలకు చల్లా బాబు ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.స్థానిక శివాలయంలో చల్లా బాబు అభ్యున్నతి కోసం విశేష పూజలు చేయించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కుమార్ ముని వెంకటప్ప జంపాల శ్రీనివాసులు వెంకటరమణ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News