Wednesday, March 18, 2026

ఘనంగా చిల్డ్రన్స్ డే ఉత్సవాలు మరికల్ లో రిషి హై స్కూల్ సేవా కార్యక్రమం……

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 14,మరికల్ మండల కేంద్రంలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని రిషి హై స్కూల్ విద్యార్థులు సంచార జాతుల పేద కుటుంబాల పిల్లలకు ఒక పూట *భోజన వసతి అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా విద్యార్థులు సేవ చేసే అవకాశాన్ని పొందినందుకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.మనసుతో పంచుకున్న ప్రతి పని సమాజానికి వెలుగు చూపుతుందని పిల్లలు ఆ రోజున అర్థం చేసుకున్నారు.పేద పిల్లలతో కలిసి గడిపిన సమయం వారికి మరపురానందమైన అనుభూతిని కలిగించిందని విద్యార్థులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక సేవ భావన, సానుభూతి, పరస్పర ప్రేమ మరింత పెరిగింది.సేవలో పాల్గొన్న విద్యార్థులకు స్కూల్ మేనేజ్‌మెంట్ మరియు అధ్యాపకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News