Monday, March 23, 2026

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 11స్వాతంత్ర సమరయోధుడు భారతావని మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ జయప్రకాష్ అధ్యక్షతన జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అధ్యాపకులు విద్యార్థులకు ఆ మహనీయుని చరిత్రను గురించి వివరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జయ ప్రకాష్ ప్రసంగిస్తూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలు దేశ విద్యా ప్రగతికి సేవలు గుర్తు చేస్తూ దేశ ప్రగతికి నాణ్యమైన విద్య విలువలతో కూడిన విద్య అవసరమని తెలియజేశారని అన్నారు అనంతరం ఆయన జీవిత చరిత్రను వివరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News