Tuesday, March 24, 2026

*ఘనంగా దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు*

నేటి సాక్షి (జిన్నారం) బొల్లారం మున్సిపల్ పరిధిలో దత్తాత్రేయ జయంతి వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక దత్తాత్రేయ ఆలయంలో జరిగిన జయంతి వేడుకల్లో మున్సిపల్ యువజన నాయకుడు వి.ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దత్తాత్రేయ స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి ప్రవీణ్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెంటారెడ్డి, శ్రీను, సత్తయ్య, ఉత్సవ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు మహిళలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News