నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 13): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వెల్గటూర్ మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు 59వ జన్మదిన పురస్కరించుకొని సోమవారం స్థానిక గౌతమ బుద్ద ఫంక్షన్ హాల్లో సాతరాజుల సుమన్, బోల్లి స్వామి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రజాధారణ పొందిన గొప్ప నాయకుడు పీఎస్ఆర్ అని, తను రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సంజీవని హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కాంపెల్లి రాజేశం, పొలం ప్రసాద్, సందినవేని రాజేందర్, పొలం స్వామి, చిలుముల రాజేంధర్, బుచ్చయ్య, మల్లేశం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.





