బెజ్జంకి’ నేటి సాక్షి:
ఆషాడ మాసం సందర్భంగా బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో రెడ్డి సంఘం కల్లె పెళ్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాల నిర్వహించారు. డప్పు సప్పులతో, శివ సత్తులతో మహిళలు బోనాలు ఎత్తు కొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.