నేటిసాక్షి/ములుగు ప్రతినిధి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఏటూరునాగారం క్రాస్ రోడ్డులో ఉన్న ఫారెస్ట్ కార్యాలయం నుండి ఆర్టిసి బస్టాండ్ వరకు నిర్వహించారుఈ సందర్భంగా ఏటూరునాగారం ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ అడవులను సంరక్షించడం మనందరి బాధ్యత అడవుల్లో నివసించే వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఆని అన్నారు ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కలు మానవాళికి అమూల్యమైన వరమని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అడవుల్లో అగ్ని ప్రమాదాలు,వన్యప్రాణుల వేట,అడవుల నరికివేత వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే తరాలకు అడవులు,వన్యప్రాణులు,ఔషధ మొక్కలు అందేలా సంరక్షణ బాధ్యత మనందరిదని ఏటూరునాగారం ఎఫ్ఆర్ఓ రెహమాన్ అన్నారు.





