మెదక్ జిల్లా.కొల్చారం, నేటి సాక్షి.( భూమయ్య) కొల్చారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన ముత్యం ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం చెందిన వివిధ పార్టీల నాయకులకు అధికారులకు పాత్రికేయ మిత్రులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రత్యేక శు భాకాంక్షలు తెలుపుతున్నానని ముత్యం ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆయన సూచించారు. ముత్యం ప్రవీణ్ కుమార్ కు, వారి కుటుంబ సభ్యులకు కొల్చారం మండలం చెందిన సీనియర్ నాయకులు కొల్చారం మండలం గౌడ సంఘం అధ్యక్షుడు గజిని వెంకట్ గౌడ్, ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, పోత శెట్టిపల్లి తాజా మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింలు, కొల్చారం మండలం చెందిన సీనియర్ నాయకులు పాల్గొని ముత్యం ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకు,ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక జన్మదిన వేడుకలు తెలిపారు.





