నేటి సాక్షి, మెట్ పల్లి
పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు డా. బెజ్జరపు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు మాట్లాడుతూ శ్రీనివాస్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తోనే ఉన్నారని అన్నారు. గత ఇరవై ఆరు సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీ తోనే ఉన్న శ్రీనివాస్ పార్టీ లో మంచి పదవులు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఆకుల లింగ రెడ్డి, కంభ సురేష్, అవుట్ల లక్ష్మణ్, అంజి రెడ్డి, జెట్టి లక్ష్మణ్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

