నేటి సాక్షి,నారాయణపేట,నవంబర్ 11, నారాయణపేట జిల్లా ను అభివృద్ధి పరచాలనే తలంపుతో తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో తనను కలిసిన వారందరికీ జిల్లా వాసులకు తన సహాయ సహకారాలు అందిస్తున్న బీదరికం కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంత వాసులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో భీష్మరాజ్ ఫౌండేషన్ ను స్థాపించిన డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మాదాసి కురువ సంఘం ఆధ్వర్యం లో భీష్మ రాజ్ ఫౌండేషన్ అధినేత రాజకుమార్ రెడ్డికి శాలువాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదాసి కురువ సంఘం జిల్లా అధ్యక్షులు సింగారం బసవరాజ్, నాయకులు ఎంకప్ప సిద్దు తిమ్మన్న వెంకటప్ప హనుమంతు తదితరులు పాల్గొన్నారు.





