నేటి సాక్షి: కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 20 కాగజ్ నగర్ పద్మశాలి భవనంలో స్వర్గీయ శ్రీ గుల్లపల్లి బుచ్చిలింగం. ఆరవ వర్ధంతి సందర్భంగా బుచ్చిలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పద్మశాలి సంఘం నాయకులుఈరోజు కాగజ్ నగర్ పద్మశాలి భవన్ లో భవన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి ముద్దు బిడ్డ, మాజీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, కాగజ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ స్వర్గీయ గుల్లపల్లి బుచ్చిలింగం 6వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొంగ సంపత్ కుమార్ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ బుచ్చిలింగం గారు క్రమశిక్షణతో నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిన మహా వ్యక్తి అని ఆయన చిన్న వయసులోనే కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ గా పదవి చేపట్టి కాగజ్నగర్ అభివృద్ధి కి కృషి చేశారని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ అభిమానిగా మొదలుకొని కార్యకర్త నుండి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా , రాష్ట్ర కార్యక్రమాల కమిటీ చైర్మన్గా పార్టీకి అంకితభావంతో పార్టీ బలోపేతం కోసం తను చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులు గడదాసు నారాయణ, బూర సమ్మయ్య, ఉపాధ్యక్షులు వంగారి రవికుమార్, పొట్ల బత్తిని సదానందం, పడాల రాజయ్య, గౌరవ సలహాదారులు గడదాసు శంకరయ్య, సంయుక్త కార్యదర్షులు దాసరి నారాయణ. సంఘ మార్గదర్శకులు మరియు భవన కమిటీ సభ్యులు సిందం చంద్రయ్య, గుల్లపెల్లి నాగేశ్వరరావు, రాపెళ్లి సదానందం, గడదాసు మల్లయ్య, వోడ్నాల వెంకన్న, కొంగ సత్యనారాయణ, గుల్ల పెళ్లి ఆనంద్, సింధం శ్రీనివాస్ మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు

