నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 14 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం .చిత్తూరు మాజీ ఎంపీ దివంగత నూతన కాలువ రామకృష్ణారెడ్డి జయంతి. వేడుకలను చౌడేపల్లి బస్టాండ్ లో ఘనంగా నిర్వహించారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి, ఆధ్వర్యంలో ఉదయాన్నే బస్టాండ్ లోని ఎన్ రామకృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు .అదేవిధంగా ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పుంగనూరు చిత్తూరు ప్రజలకు దివంగత నూతన కాలువ రామకృష్ణారెడ్డి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూల చంద్రమౌళి నారాయణ రాజు గిరి నాయుడు పవన్ కుమార్ పంజాని పల్లి బాబు నాయుడు చంగల్ రాయుడు కుమార్ రెడ్డి. వెంకటరమణ అర్జున్ రాయల్ ప్రభాకర రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

