నేటి సాక్షి, బెజ్జంకి: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మండలం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల నిర్మల, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్సై కృష్ణారెడ్డి జెండాను ఆవిష్కరించగా, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే కాంగ్రెస్, బిజెపి పార్టీ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించగా, బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్ పంపింణి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.