నేటి సాక్షి, దేవరకద్ర జులై 13
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో ఆదివారం ఆలంపల్లి లక్ష్మయ్య, బాల మనెమ్మ దంపతుల ఇంట్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ రీతిలో భక్తిశ్రద్ధలతో ఈ కళ్యాణ ఘట్టాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి దంపతులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అలంకరించారు. కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.