నేటి సాక్షి, నల్లబెల్లి జనవరి 21 : పెట్టుబడి దారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా మార్క్సిజం సిద్ధాంతాన్ని అన్వయించి, అక్టోబర్ 17 న విప్లవం ద్వారా రాచరిక జార్ చక్రవర్తి పాలనను కూలదోసి కార్మిక కర్షక రాజ్యాన్ని నిర్మించిన విప్లవం ప్రధాత కామ్రేడ్ లెనిన్ అనీ కుమారస్వామి అన్నారు. మండల కేంద్రమైన నల్లబెల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సిపిఐ ఆధ్వర్యంలో లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లెనిన్ మరణించి 102 ఏండ్లు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆలిన దేశాల్లో సంక్షేమ రాజ్యాలు అవతరించడానికి లెనినిజమే ప్రధాన కారణమన్నారు. లెనిన్ స్థాపించిన సోషలిస్టు సోవియట్ యూనియన్ ఉండటం వల్లనే సామ్రాజ్యవాదం వెర్రి తలలు వేయకుండా ప్రపంచాన్ని కాపాడి రెండవ ప్రపంచయుద్ధం లో విజయం సాధించడానికి కారణం లెనినిజమే ప్రధాన భూమిక వహించందన్నారు.. స్వాతంత్ర్యం అనంతరం నుంచి నేటికీ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదగడానికి, సంక్షేమ సామ్యవాద రాజ్యంగా నిలబడటానికి లెనినిజమే కారణమన్నారు. దోపిడీ లేని వర్గ రహిత ప్రపంచం కోసం తపనపడ్డ లెనిన్ ఆశయాలను భారతదేశ యువతరం స్ఫూర్తిగా తీసుకొని కమ్యూనిస్టులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పరికి రత్నం, మనుగొండ ప్రసాద్, కనుక రవి చందర్, మహమ్మద్ హైమద్, కోలా లింగయ్య,కొండి అశోక్,గుండెబోయిన ఐలయ్య,లింగయ్య,తదితరులు పాల్గొన్నారు.

