నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని శాంతి నగర్ లో ఉన్న వర్డ్ & డీడ్ ప్రైమరీ పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ ఫ్రూట్ ఫెస్టివల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యం.డి కలీమ్ మాట్లాడుతూ, విద్యార్థులువివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, జంక్ ఫుడ్స్, వివిధ రకాల నమూనాలు, ప్రయోగాలతో కూడిన ఆకృతులను ప్రదర్శించి, తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నారని అన్నారు.అనంతరంప్రతిభ చూపిన సైన్స్ ప్రాజెక్టులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు హాబీబా, అన్నపూర్ణ, నస్రీన్,ఆసియా, నిఖిత, ఫర్జానా, సుమలత, రిజ్వానా, నాజియా, కరుణ, షబాన, శిల్ప, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.





