నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
భరతమాత ముద్దుబిడ్డ, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి చందుర్తి మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో అయన చిత్ర పటానికి పూల మాల వేసి జయంతిని జరపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓబీసీ మోర్చా జిల్లా ఉప అధ్యక్షులు చిలమల హనుమయ్యా చారి, మర్రి మల్లేశం, యువ మోర్చా మండల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, నాయకులు బోరుగాయ తిరుపతి, తీపి రెడ్డి మనోహర్ రెడ్డి, చింత కుంటా శ్రీనివాస్, తోట శంకర్, ప్రశాంత్ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





