మరికల్ లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం నారాయణపేట బిజెపి జిల్లా నాయకులు కే నర్సం గౌడ్ నేటి సాక్షి,నారాయణపేట జూన్ 23, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ఇంద్ర గాంధీ చౌరస్తాలో శ్యాంప్రసాద్ గారి వర్ధంతి వేడుకలను మరికల్ మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరికల్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వర్ధంతి పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కే నర్సంన్ గౌడ్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అఖండ భారత వాణి కోసం ప్రాణాలు అర్పించిన భారతమాత ముద్దుబిడ్డ జనసంగు వ్యవస్థాపకుడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి శతకోటి వందనాలన్నీ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మంగలి వేణుగోపాల్, మండల నాయకులు రమేష్ కుమార్, సురేందర్ గౌడ్, శెట్టి మహేష్ కుమార్, శివకుమార్, ప్రతాప్ రెడ్డి, శెట్టి స్వామి, కూసురు రవికుమార్, శ్రీరామ్, మోహన్ రెడ్డి, రామచంద్రయ్య, పరశురాం, నిఖిల్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

