*నేటి సాక్షి- మేడిపెల్లి* భీమారం మండలం ఒడ్డాడు గ్రామంలో సావిత్రి భాయి జయంతి సందర్భంగా స్థానిక పాఠశాలలో వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్, సావిత్రిబాయి పూలె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహిళ ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి, ని శాలువతో సత్కరించారు. సావిత్రి భాయి ఆడపిల్లల చదువుకు ఎంతో కృషిచేసారన్నారు. ఎన్నో పోరాటాలు ఎదుర్కొని దేశంలోనే మొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా పేరొంది ఎంతో మందికి విద్యాబోధన కల్పించారని పేర్కొన్నారు. విద్యార్థులు సావిత్రి బాయి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని వారి ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాకేష్ కుమార్, ఉపాధ్యాయులు లింగమూర్తి, మహేందర్, ధన లక్ష్మీ, ఎఎపిసి చైర్మన్ లహరి, తదితరులు పాల్గొన్నారు.

