Thursday, February 12, 2026

ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

నేటిసాక్షి, మిర్యాలగూడ : మండల పరిధిలోని యాద్గార్ పల్లి గ్రామంలోనిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం “స్వపరిపాలన దినోత్సవం” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులుగా, ప్రధానోపాధ్యాయులు గా మరియు ఉపాధ్యాయులుగా చక్కని వేషధారణతో పాటు, తరగతి గదిలో వివిధ రకాల టిఎల్ఎం ల సహాయంతో చక్కని బోధన & పాఠశాల పర్యవేక్షణను చాలా బాగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాలు నాయక్ అందరికీ స్వపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజ జీవితంలో కూడా విద్యార్థులు తాము పోషించిన పాత్రలను భవిష్యత్తులో సాకారము చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా ప్రధానోపాధ్యాయులుగా నవీన్ కుమార్, ముఖ్యమంత్రి గా గణేష్, విద్యాశాఖ మంత్రిగా సాయి కుమార్, జడ్పి చైర్మన్ గా అక్షిత శ్రీ, కలెక్టర్ గా అక్షిత, జాయింట్ కలెక్టర్ గా వైష్ణవి, జిల్లా విద్యాశాఖ అధికారిగా మనీషా, ఆర్డీఓ గా అపర్ణ, తహశీల్దార్ గా ఐశ్వర్య, ఎంఈఓ గా రేణుక వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ బృందం వెంకటయ్య, వెంకట మహేశ్వర్, విజయ, సైదా చారి, శ్రీశైలం, జాకీర్ హుస్సేన్, శేఖర్ రెడ్డి, ప్రశాంతి, రాము, వెంకట రత్నంలు విద్యార్ధినీ, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News