Thursday, February 26, 2026

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు

నేటి సాక్షి,నారాయణపేట,, ఫిబ్రవరి 25 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ) నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కిస్తాపూర్ గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ కిష్టాపూర్ పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బుధవారం ఉపాధ్యాయులుగా, అధికారులుగా బాధ్యతలు చేపట్టి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు జిల్లా కలెక్టర్‌గా కె . సుహాసిని, జిల్లా విద్యాశాఖాధికారిగా (డిఈ ఓ ) జె . కృష్ణవేణి, మండల విద్యాశాఖాధికారిగా (ఏ ఈ ఓ ) శివప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలిగా . నందినిల పాత్రలను పోషించారు. అధికారుల బాధ్యతలు, విధులు గురించి వివరిస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నడిపించారు.అసెంబ్లీ నిర్వహణ, తరగతుల బోధన, పాఠశాల పరిపాలన వంటి కార్యక్రమాలను విద్యార్థులే చేపట్టి తమ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం మరియు బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ వేడుకలు పాఠశాల వాతావరణంలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపి విజయవంతంగా ముగిశాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News