చౌడేపల్లి సెప్టెంబర్ 7 Neti Sakshi ;
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు భక్తి శ్రద్దలతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్యనిర్వాహణాధికారి ఏకాంబరం ఆద్వర్యం లో జరిగింది,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రధాన అర్చకులు చండీహోమం మహిమ ను వివరిస్తూ చండీహోమం కేవలం ఒక వర్ణం కో ఒక వర్గం కో మాత్రమే కాదు.. అన్ని వర్ణాల వారికి సంబంధించినది.లక్ష్మీ, సరస్వతీ, కాళికాదేవి.. ఈ ముగ్గరు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ.. ఈమె హోమం చేయడంవల్ల సమస్త బాధలు నివారణమవుతాయి.వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, శత్రువులు నశిస్తారని, పరప్రయోగాలతో బాధపడేవారు, తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు, అకారణంగా కోర్టు కేసులలో ఇరుక్కుంటున్నవారు, ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడతున్నవారు చండీహోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని, వాటి నుండి బయటపడతారని.లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోందని. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య,అది లలితా పారాయణం, చండీ పారాయణం ..అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం, లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుందని అర్చకులు భక్తులకు తెలియజేశారు.అనంతరం బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మూసివేసిన ఆలయ అధికారులు.సోమవారం ఉదయం ఐదం గంటలకు ఆలయ ప్రాంగణంలో శుద్ధిచేసన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఉప కమీషనర్ ఏకాంబరం తెలియజేశారు.





