నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1,16,000 మంది సంతకంపెట్టి తమ వ్యతిరేకతను వ్యక్తం చేయగా ప్రజలు సంతకం పెట్టిన పత్రాలను ఇప్పటికే తిరుపతి జిల్లా పార్టీకి అందజేశారు.. అక్కడ నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంకు తరలించే క్రమంలో చేపట్టిన భారీ ర్యాలీకి చంద్రగిరి నియోజక వర్గం నాయకులు, కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట తెలుగుతల్లి విగ్రహం నుంచి సోమవారం ప్రారంభమైన భారీ ర్యాలీ తిరుపతి పద్మావతీపురం వద్దకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ర్యాలీ ఒక గంటపాటు నగరంలో ప్రయాణించి పద్మావతీపురంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు ఉదయం 10 గంటలకు చేరుకుంది. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన భారీ ర్యాలీకి పార్టీ నేతలు, కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. ర్యాలీలో ద్విచక్ర వాహనాలు ముందు వెళుతుండగా కార్లు వాటిని వెంబడిస్తూ వరుసక్రమంలో సాగుతుండటం చూసిన జనం జహయో జగనన్నా.. అంటూ నినదించారు.. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ర్యాలీలో పాల్గొన్న యువత నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకు సాగారు. *సీఎం చంద్రబాబు సొంత ఊరిలోనే వ్యతిరేకిస్తున్నారు*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసే సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఆయన సొంత ఊరిలో నుంచే వ్యతిరేకిస్తున్నారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విమర్శించారు. పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వంకు చంద్రగిరి నుంచే తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టి, పెరిగిన ఊరు నుంచే ప్రజలు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలన్నారు. జగనన్న ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో 1లక్షా 16వేల మంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేయడం జరిగిందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాకు వివరించారు. *రెపరెపలాడిన పార్టీ జెండాలు*తుమ్మలగుంట నుంచి బయలుదేరిన భారీ ర్యాలీలో పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ముందు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు ద్విచక్రవాహనాలు నడుపుతూ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలబడతా వారి వెంట వందలాది మంది నాయకులు, కార్యకర్తలు తమ వాహనాలు నడుపుతూ ముందుకు సాగారు. సుమారు 300 ద్విచక్రవాహనాలు, 75 కార్లు ర్యాలీలో పాల్గొనగా వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తుమ్మలగుంట నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో పాటు ర్యాలీని విజయవంతంగా తీసుకువచ్చిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలను జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఆర్కె రోజలు ప్రత్యేకంగా అభినందించారు.





