*నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చంద్రగిరి*గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది. గత కొన్నేళ్లుగా అయితే పల్లి రంగంపేట రోడ్డులోని పులితివారిపల్లి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టని గత పాలకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారు 14.60 కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 2025 సంవత్సరంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో చంద్రగిరి నియోజకవర్గంలోని శిథిలావస్తుకు చేరుకున్న బ్రిడ్జిలను స్థానంలో నూతన బ్రిడ్జిలో ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని కోరిన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే నిధులు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పులితివారిపల్లి బ్రిడ్జి వద్ద జెసిబి ద్వారా పూడికను తీస్తున్న అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే గారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు,కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





