Wednesday, July 23, 2025

చంద్రబాబు మోసాలకుగట్టి జవాబు. రీకాలింగ్ మ్యానిఫెస్టోతో ఇంటింటి చైతన్యం..

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్

ఇంటింటికీ వైఎస్ఆర్ సిపి పనిచెప్పే వేళ..రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రతిధ్వనించాలి..*

మ్యానిఫెస్టో లోని హామీలు..సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం..*

ప్రభుత్వ వైఫల్యాలను తెలియచెప్పేందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో పేరిట విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్..

జూన్ 25 నుంచి 5 వారాల పాటు కొనసాగనున్న రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో…
ఇంటింటికెళ్లి చంద్రబాబు మోసాలను.. హామీలను అమలు చేయనందున జరిగిన నష్టాన్ని.. జగన్ హయాంలో ఏ విధంగా పథకాలు అందాయో పార్టీ శ్రేణులు వివరించాలి…*

ప్రజల్లో చైతన్యం నింపి.. టిడిపి మోసాలపై స్పష్టత నివ్వాలి…*
వైఎస్ఆర్ సిపి చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేసి అన్నమయ్య జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుదాం…*
రాయచోటి వేదికగా జిల్లా స్థాయి సమీక్షా సమావేశం.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో పై ఘనంగా జరిగిన అన్నమయ్య జిల్లా స్థాయి సమీక్ష సమావేశం…*

వైఎస్ఆర్ సిపి జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధాల విభాగాల నాయకులకు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం..*

ముఖ్య అతిధిగా హాజరైన వైఎస్ఆర్ సిపి రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మేడా రఘునాద రెడ్డి, వైఎస్ఆర్ సిపి నియోజక వర్గ ఇంచార్జిలు చింతల రామచంద్రారెడ్డి (పీలేరు), ఎంఎల్ఏ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి (తంబల్లపల్లె), నిస్సార్ అహమ్మద్ (మదనపల్లె), జెడ్ పి మాజీ చైర్మన్, ఇటీవల టి డి పి ని వీడి వైసిపిలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం తదితర నేతలు…*
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో”
పేరిట ఒక వినూత్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారని వైఎస్ఆర్ సిపి నేతలు పేర్కొన్నారు.శుక్రవారం నాడు జిల్లా కేంద్రమైన రాయచోటి లోని వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యాలయంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో పై అన్నమయ్య జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వైఎస్ఆర్ సిపి రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధ రెడ్డి అధ్యక్షతన, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాద రెడ్డి, వైఎస్ఆర్ సిపి నియోజక వర్గ ఇంచార్జిలు చింతల రామచంద్రారెడ్డి (పీలేరు), ఎంఎల్ఏ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తంబల్లపల్లె, నిస్సార్ అహమ్మద్ మదనపల్లె), జెడ్ పి మాజీ చైర్మన్, ఇటీవల టి డి పి ని వీడి వైసిపిలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం తదితర నేతలు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమాన్ని పూర్తి ఉత్సాహంతో ,క్రమశిక్షణతో నిర్వహించి అన్నమయ్య జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలపాలన్నారు. ప్రజల్లో చైతన్యం నింపి, టి డి పి మోసాలపై స్పష్టత నిస్తూ,జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను వివరించాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి 5 వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు.టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ పథకాల అమలు విఫలమైందని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఈ కార్యక్రమంలో QR కోడ్ స్కాన్ విధానాన్ని ఉపయోగించాలని, ఈ QR కోడ్‌ను స్కాన్ చేసి, ఒక బటన్ నొక్కితే చంద్రబాబు నాయడు మేనిఫెస్టో వివరాలు, మరో బటన్ నొక్కితే కూటమి వాగ్దానాలు నెరవేరకపోవడం వల్ల ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో లెక్కలు, వివరాలు చూపిస్తాయని నేతలు వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్‌ హామీలో భాగంగా.. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు రూ.3,000-6,000 భృతి, ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.20,000 సాయం, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి వాగ్దానాలు అమలు కాలేదని, ఈ వైఫల్యం వల్ల ప్రతి కుటుంబం సగటున రూ.1-2 లక్షల నష్టపోయిన విషయాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి, ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News