Tuesday, March 10, 2026

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

పోలీసు, రెవిన్యూ అధికారులు.

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 30,

పేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు
ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుంది అని నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి ప్రతి నెల చివర పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. కొన్ని సంవత్సరముల క్రితం కుల వివక్ష ఉండేది అని ప్రస్తుతం అంతగా లేనప్పటికీ అక్కడక్కడ గ్రామాలలో ఉన్న అసమానతలను అంటరానితనాన్ని,కుల వివక్షను నిర్ములించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దానికి కృషి చేయాలని అన్నారు. కుల నిర్ములనకు, ఎస్సీ ఎస్టీ కులాల వారిని చైతన్య పరుచుటకు, వారిని అభివృద్ధి వైపు నడిపించుటకు పోలీస్ శాఖ గ్రామాలలో రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో పౌరహక్కుల రక్షణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని అన్ని కులాలకు చెందిన వారిని గ్రామాలలో సమావేశం నిర్వహించి చట్టాలను అమలు చేయు విధానం గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావడం కుల వివక్ష నిర్ములనపై అవగాహన కల్పించడం వల్ల అందరికి అవగాహన చైతన్యం ఉంటుందని అన్నారు. పౌర హక్కుల దినం నిర్వహించడం గ్రామాల్లో ఇంకా కుల వివక్ష అంటరానితనము దళితుల భూవివాదాలు మహిళలపై అత్యాచారాలు నిరోధించడం జరుగుతుందన్నారు.కులం పేరుతో ఎవరినైనా దూషిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అంటరానితనం నేరమన్నారు. కులమతాల్లో తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యoగా ఉండాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News