నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
గంగాధర నెల్లూరు చదువుకున్న యువతి యువకులకు ఉపాధి కల్పించడమే కూటమీ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు మండలం జడ్పీ హైస్కూల్ ఆవరణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు సుమారు 20 కంపెనీలకు సంబంధించిన వారు ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి అపాయింట్మెంట్ లెటర్లను ఎమ్మెల్యే థామస్ అందించారు ఇంటర్వ్యూలో కొంతమంది అపాయింట్మెంట్ కాకపోతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి అపాయింట్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా కంపెనీ వారు తీసుకుంటారని తెలిపారు అలాగే మన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో నుంచి చదువుకున్న యువతి యువకులు 500 మంది ఇంటర్వ్యూలో పాల్గొన్నారు