నేటిసాక్షి, రాయికల్ :
విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ద వహించి అభివృద్దిలోకి రావాలని రాయికల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు, న్యాయవాది కొత్తపెల్లి రంజిత్కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఇటిక్యాల్ మోడల్ స్కూల్, కాలేజీలో విద్యార్థులకు నోటుబక్కులు, పెన్నులు పంపిణీ చేసారు. డిస్టిక్ 320జి లయన్స్ క్లబ్ ఏర్పాటై పదేళ్లు అయినా సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహారాజు కోదండ రాములు పిలుపు మేరకు సోమవారం దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్తపెల్లి రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన విద్యార్థినులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, మెమొంటో లు అందించారు. స్థానిక ప్రైమరీ స్కూల్లో సుమారు 50 మంది విద్యార్థిని, విద్యార్థులకు నోటుబుక్కుల, పెన్నులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి బొడుగం అంజిరెడ్డి, ఆదిరెడ్డి, మండలోజు శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 08RKL02: నోటు బుక్కులు, పెన్నులు పంపిణీ చేస్తున్న దృశ్యం