నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై మొగ్గు చూపాలని, ముందుగా క్రీడాకారులకే ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు శనివారం మండల కేంద్రములోని శ్రీ గీతాంజలి స్కూల్ లో మేన్వల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రవి నాయుడు తోపాటు ఎ ఎస్పీ రవి మనోహర్ ఆచ్చారి పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు విద్యార్థులచే స్పోర్ట్ మార్చ్ నిర్వహించారు అనంతరం క్రీడా జ్యోతి వెలిగించారుఈ కార్యక్రమంలో శ్రీ గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడారంగంలో కూడా శ్రీ గీతాంజలి విద్యాసంస్థల విద్యార్థులు ముందు ఉండాలని, విద్యార్థులను ప్రోత్సహించడంలో ముందు ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం శ్రీ గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సురేంద్ర మాట్లాడుతూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ క్రీడలలో బాగా రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చి ప్రోత్సహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎ ఎస్పీ రవి మనోహర్ ఆచ్చారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడలలో ఓడిపోవడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదు ఓటమి నుంచే మన గెలుపును వెతుక్కోవాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో ముందు ఉంటారని ఆరోగ్యమే మహాభాగ్యం ని విద్యార్థులకి తెలియజేశారు. మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ విద్యతో పాటు ప్రతి విద్యార్థి క్రీడలు పాల్గొనాలని క్రీడల్లో రాణించినవారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు ఐటీ, విద్యా శాఖామంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని మెరుగుపరచుటకు విద్యార్థులకు ఉన్నతమైన విలువలు నేర్పుటకు , శ్రీ గీతాంజలి విద్యాసంస్థలు విద్యార్థులను వివేకానంద, ఠాగూర్, రామన్ మరియు మహావీర్ లాంటి ఉన్నత వ్యక్తుల వ్యక్తిత్వాలను విద్యార్థి నులను నాలుగు విభాగాలుగా విభజించి విద్యార్థుల మధ్య ఒక పోటీ ప్రపంచాన్ని నిలిపి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు ఒక మార్గాన్ని ఏర్పరచినందుకు శ్రీ గీతాంజలి విద్యాసంస్థలకు అభినందనలు తెలియజేశారు. అలానే క్రీడల్లో రాణించిన విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ , దీప, నాగరాజు , పిఇటి లు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

