**నేటి సాక్షి, ఎండపల్లి:* రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలకు చీరలను అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం గత నవంబర్ 19న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని మహిళలకు సంక్రాంతి పండుగ లోపు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా పంపిణీ కొనసాగుతుంది. చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం సర్పంచ్ పడిదం లావణ్య మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని, గ్రామంలోని మహిళా సంఘ సభ్యులందరికీ చీరలు అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అల్గం తిరుపతి, పంచాయతీ కార్యదర్శి తిరుపతి రెడ్డి, కోటిలింగాల ఆలయ కమిటీ డైరెక్టర్ మెరుగు శ్రీనివాస్, వార్డు సభ్యులు సొల్లు రాజేష్, జెల్ల శ్రీనివాస్, సిగిరి లత, కాంగ్రెస్ నాయకులు పడిదం మొగిలి, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కుల మహేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పత్తిపాక శ్రీధర్, మాదాసు గంగాధర్, సీనియర్ నాయకులు పడిదo శంకరయ్య, మెరుగు రాజేశం, బుర్రి మహిపాల్, మహిళా సంఘ సీఏ జెల్ల మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

