నేటి సాక్షి, ఎండపల్లి:* మండలం పరిధిలోని చర్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యచరణలో భాగంగా శుక్రవారం “ఫ్రైడే–డ్రైడే” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పడిదం లావణ్య-మొగిలి ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న పూడికతీత పనులను పరిశీలించి, నీరు నిల్వ అవకుండా చర్యలు తీసుకున్నారు. చెత్తకెక్కి, అడ్డుపడ్డ పూడికతీతను శుభ్రం చేయడంతో, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించ వచ్చునని తెలిపారు. దీనికి ముందుగా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన పశువుల మందను మందోటకు తరలించేందుకు నాయకులతో కలిసి చర్చించి ఈ నెల చివరి వరకు వేలంపాట నిర్వహించి తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, పంచాయతీ కార్యదర్శి కె.తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ అల్గం తిరుపతి, వార్డు సభ్యులు జెల్ల శ్రీనివాస్, నాయకులు జక్కుల మహేష్, పత్తిపాక శ్రీధర్, మెరుగు శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, జంజుపెల్లి నరేష్, బుర్రి మహిపాల్, సిగిరి మహేష్, పంచాయతీ కారోబర్ ఉరగొండ శోభన్, ఆశా కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





