Tuesday, March 17, 2026

చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎదురుగా ఉన్న బోర్డును తొలగించాలి రజక సంఘం అధ్యక్షుడు రాపాల లక్ష్మీనారాయణ

నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి డిసెంబర్ 24 : చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎదురుగా ఉన్న బోర్డును తొలగించాలని గ్రామ సర్పంచికి వినతి పత్రం అందించిన రజక సంఘం. నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గుండా ఎస్సారెస్పీ కాలువ బ్రిడ్జి పక్కన స్థలంలో తెలంగాణ రైతాంగ సాహిత పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ 26 సెప్టెంబర్ 2022 నల్లబెల్లి రజక సంఘం ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాలవల్ల పనులు చేయలేకపోయాము అంటూ 01 ఆగస్టు 2025 నాట్ నుండి దాతల సహకారంతో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు జరుగుతున్నవి. చాకలి ఐలమ్మ విగ్రహం ముందు భారత్ గ్యాస్ ఫ్లెక్సీ బోర్డు అడ్డుగా ఉన్న బోర్డును తొలగించమని యజమానికి చెప్పగలరని రజక సంఘం సభ్యులు గ్రామ పెద్దలు కలిసి నల్లబెల్లి గ్రామ సర్పంచి నాగేల్లి జ్యోతి కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, వైనాల జక్కయ్య, వైనాలసార మల్లయ్య, రాయరాకుల సాంబయ్య రజక యువజన సంఘం నాయకులు వైనాల మధు, తంగేళ్ల భాస్కర్, తంగేళ్ల వేణు, నన్నేసాహెబ్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News