నేటి సాక్షి 24 నవంబర్ జూపాడుబంగ్లా: జూపాడు బంగ్లా మండలం చాబోలు, బన్నూర్ గ్రామ 200 కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ హామీ మేరకు త క్షణమే జూపాడుబంగ్లా గ్రామంలో ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు గృహాలు నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఆదివారం సిపిఐ శాఖ సమావేశం కార్యదర్శి నాగన్న, రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి చాబోలు గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక రూపాల్లో ఆందోళన కొనసాగించామని పోతిరెడ్డిపాడు వెడల్పు బ్లాస్టింగ్ వల్ల ఇళ్ళంతా దెబ్బతిని పగుళ్లతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. అనేకసార్లు పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేశామని తీరా గృహాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండగా ఇళ్ల స్థలాలు లేకుండా గృహాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఈ విషయంపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరారు.. కాబోలు 80 బన్నూరు సిద్దేశ్వరం తదితర గ్రామాల పేద గిరిజనులకు దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న కాలనీ పక్కన జూపాడుబంగ్లాలో తనని కేటాయించి ఇప్పుడు గృహాలు దరఖాస్తుకు సహకరించాలని వారు కోరారు లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష తప్పదని వారి హెచ్చరించారు.. కార్యక్రమంలో గ్రామ శాఖ నాయకులు రమణ సుధాకర్ శేఖర్ రాజు ప్రజలు పాల్గొన్నారు..





