నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 3 మండలంలోని చారాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సాయిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని , ఉపాధ్యాయునీయురాలైన వసంత,స్రవంతి లకు దుశ్శాలువతో సత్కరించిన ఉపాధ్యాయులు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ మట్లాడుతూ సాయిత్రిబాయి ఫూలే మరెవరో కాదు భారతీయ సంఘ సంస్కర్త మరియు భారతదేశపు మొట్టమొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు అని,స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అని మరియు వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. ఆమె అధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను,అవమానాలను ఎదుర్కొంది అని వారిని ఆదర్శం గా తీసుకొని ఎంతో మంది మహిళా ఉపాధ్యాయులు ముందంజులో ఉండాలని ఆయన తెలిపారు.ఉపాద్యాయుడు గణేష్ మాట్లాడుతూ అందరూ చదువుల తల్లి సరస్వతి అంటారు. ఐతే చదువుల తల్లి సరస్వతి కాదు సావిత్రిబాయి పూలే అని,ఈ రోజు ప్రతి మహిళ పురుషులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కారణం మాతా సావిత్రి బాయి పూలే నని ఆయన అన్నారు. కాబట్టి ఆవిడను ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపనకు మీరందరూ పాటుపడాలని వారు తెలియజేశారు.

