నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 3చౌడేపల్లి మండలంలోని పంచాయితీ కేంద్రం చింతమాకులపల్లి చెరువుకు గండి పడింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెంతా తుఫాన్ నుంచి ప్రస్తుత దిత్వ తుఫాన్ వరకు ప్రతిరోజు వర్షం కురుస్తోంది నీరు చేరుకున్నాయి చెరువు నిండుకుండలా ఉంది అని రైతులు సంతోషించాలా లేక కట్ట బలహీనపడి గండ్లు పడుతున్నాయని బాధపడాలా అని వారు వాపోతున్నారు చెరువు కట్ట గండిపడి నీరు వెళ్ళిపోతే పంటలు ఎలా వేసుకోవాలని రైతులు వాపోతున్నారు సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయకట్ట రైతులు కోరుతున్నారు





