Saturday, March 14, 2026

చిట్టత్తూరు గ్రామంలో మహిళలు భక్తిశ్రద్ధలతో నాగదేవతలకు పూజలు.

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)* *రామచంద్రాపురం*రామచంద్రపురం మండలం లోని గ్రామాలలో మహిళలు శనివారం నాగల చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. దీపావళి పండుగ నుంచి వచ్చే ఐదవ రోజు చవితి రోజు నాగల చవితి పండుగ చేయడం పురాణ ఆనవాయితీ, ప్రతి ఒక్క మహిళ తమ సౌభాగ్యం, కుటుంబ క్షేమం, వంశాభివృద్ధి కోసం భక్తిశ్రద్ధలతో త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువుకి వాసుకి దేవతక, శివుడి మెడలో నాగేంద్ర దేవుడుగా, నాగదేవతంలో విశిష్టుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రూపమైన రోజుగా నాగల చవితి రోజున మహిళలు శ్రేష్టంగా పాలు విశేష సుగంధ ద్రవ్యాలతో పూజలు చేసి పండ్లు పరమాన్నాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు . సికె పల్లి పంచాయతీ గ్రామంలో మహిళలు గ్రామదేవత నాగాలమ్మ తల్లికి, శ్రీ మహావిష్ణు స్వరూపమైన రావి చెట్టుకి గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు, కుటుంబాల శ్రేయస్సు కొరకు ఉదయం నుంచే ఉపవాసంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News