నేటి సాక్షి తిరుపతి *********************చిత్తూరు -01-01-26*********************చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు నేతృత్వంలో చిత్తూరు ఎంపీ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చిత్తూరు నగరం, లక్ష్మీ నగర్ కాలనీలోని ఎంపీ కార్యాలయానికి క్యూ కట్టారు.తమ అభిమాన నాయకుడు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. చిత్తూరు ఎంపీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, సాదరంగా ఆహ్వానించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ప్రతిగా అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ముఖ్యంగా…చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, చూడా చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,మాజీ ఎమ్మెల్యే మనోహర్, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలకమండలి అధ్యక్షులు మణి నాయుడు, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్, టిడిపి చిత్తూరు పార్లమెంటు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, టిడిపి సీనియర్ నేతలు చంద్రప్రకాష్, కాజూరు బాలాజీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రాజేష్, యాదవ సాధికారత సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, కూటమి నాయకులు వెంకటేష్ యాదవ్, రాజశేఖర్ నాయుడు, భాస్కర్ నాయుడు, తిరుమల, అలాగే టిడిపి, బిజేపి,జనసేన,ప్రజా సంఘాల నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, చిత్తూరు పార్లమెంటు ప్రజలు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావును పూల మాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

