ఆరుగురు మృతి*…*దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు* *చిత్తూరు* చిత్తూరు, బెంగళూరు జాతీయ రహదారిలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.విజయవాడలో ఉన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ..,గంగాధర నెల్లూరు తెలుగు దేశం పార్టీ నాయకుల ద్వారా దుర్ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా జీడి నెల్లూరు నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు. ఈ ఘటనలో వెదురుకుప్పం మండలం, ఆళ్లమడుగు చెందిన టీడీపీ నాయకులు కేశవులు రెడ్డి, ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ కుమార్తె, బి.టెక్ చదువుతున్న తులసి మృతిచెందడం దురదృష్టకరమన్నారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ…,గాయాలపాలైన వారికి అత్యవసర సేవలు అందించాలని ఆయన వైద్యులకు సూచించారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం.., పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.