Tuesday, March 17, 2026

*చినబాబుకు అభినందనలు వెల్లువ*

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)*రామచంద్రాపురం* ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డ్ డైరెక్టర్గా (మురళీమోహన్) చినబాబు నియమతులైన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన స్వగృహంలో డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి తో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు, అభిమానులు చినబాబును కలిసి పుష్పగుచ్చాలను అందించి దుస్సాలవలతో సన్మానించి ఆభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు జీవనోపాధి మార్గాలను కల్పించడానికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ అధికారంలోకి వచ్చిన కొంత కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీనాథరెడ్డి, మధు, సురేష్, కోటపాటి హరినాయుడు, జిత్తు, ప్రకాష్ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News