నేటి సాక్షి దమ్మ శ్రీధర్ (మంచిర్యాల) డిసెంబర్ 01రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలిక మిస్సింగ్, హత్య కేసు ఛేదించడం లో రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల మేరకు, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల ఏసీపీ ఆర్ . ప్రకాష్ గారి ఆధ్వర్యం లో నాలుగు బృందాలు సీఐ లక్షెట్టిపేట రమణమూర్తి గారు , ఎస్ ఐ దండేపల్లి తాహేశీనుద్దీన్,లక్షెట్టిపేట సురేష్, ఎస్ ఐ జన్నారం అనూష ఆధ్వర్యంలో టీమ్ దర్యాప్తు లో భాగంగా తేదీ:27-11-2025 న ప్రొద్దున బాధితురాలి శవం కొక్కెర మల్లయ్య బావిలో తేలిందని తెలియగా శనిగారపు బాపు మరియు ఉపారపు సతీష్ ఫోన్ మాట్లాడుకొని కలిసి దూరంగా ఎక్కడికైనా పారిపోదామని వాళ్ళు ఇద్దరు ద్వారకా గ్రామ శివారులో కలుసుకొని వారి యొక్క మోటార్ సైకిళ్ళ పై మాదాపూర్ నుండి మ్యాదరిపేట వైపు వచ్చేటప్పుడు ఈరోజు అనగా తేదీ 01/12/2025 రోజున మాదాపూర్ లోని శ్రీ సిద్ది వినాయక హనుమాన్ టెంపుల్ మాదాపూర్ రోడ్డు వద్ద పోలీస్ వారు పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల వద్ద నుండి యొక్క 2 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్ళు, బట్టలు, 2-ఖాళి క్వార్టర్ మద్యం సీసాలు, హుల్కీ ఫుల్కీ చిప్స్ పాకెట్ మరియు బాధితురాలి 2 గాజులు, ఒక పట్టాగొలుసు స్వాధీనం చేసుకోవడం జరిగింది.*నిందితుల వివరాలు* శనిగారపు బాపు , S/O పోశమ్ , వయస్సు 52 సం//లు, కులం : SC- మాదిగ , గ్రామం: నంబాల , దండేపల్లి మండలం, మంచిర్యాల జిల్లా. ఉపారపు సతీష్ @ సత్తయ్య s /o మొండి, 40 సం ‘లు కులం : SC- మాదిగ, గ్రామం: నంబాల , దండేపల్లి మండలం. మంచిర్యాల జిల్లా.*వివరాల్లోకి వెళితే…*ముద్దాయిలు ఇద్దరు నంబాల గ్రామ SC కాలనీ కి చెందిన వారు. బ్యాండ్ పని చేసుకుంటూ జీవిస్తారు. శనిగారపు బాపు కి 20 సం ల క్రితం పెళ్లి జరిగినది. సుమారు 06 సం ల క్రితం అతని బార్య చనిపోయింది. తన కూతురు కొడుకు కూడా అతన్ని వధిలేశారు. ఉపారపు సతీష్ అనునతనికి కూడా గత 5 సం సం ల క్రితం పెండ్లి జరిగి, పెండ్లి అయిన 2 సంసం. ల తర్వాత అతనికి తన బార్యతో విడాకులు అయినది. తేదీ: 24/11/2025 రోజున శనిగారపు బాపు, ఉప్పారపు సతీష్ ఇద్దరు కలిసి బయట చింత చెట్టు కింద ఆడుకుంటున్న బాదితురాలిని నోరు మూసి ఎత్తుకొని దగ్గర లో పత్తి చేనులో క్రింద పండబెట్టి ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిని బలవంతగా అనుభవించినారు. బాధితురాలితో బలవంతగా కామ కోరిక తీర్చుకున్న తర్వాత బాధితురాలిని బయటకు వస్తే ఎవరకైనా చెప్పుతదనే భయంతో ఆమెను చంపాలనే ఉద్దేశ్యంతో ఆమె గొంతు దగ్గర గట్టిగా నొక్కి, తర్వాత ప్రక్కనే ఉన్న కొక్కెర మల్లయ్య వాళ్ళ యొక్క వ్యవసాయ బావిలో పడేసినారు. ఈ కేసు ఛేదించడం లో కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్ . ప్రకాష్ గారి ఆధ్వర్యం లో నాలుగు బృందాలు సీఐ లక్షెట్టిపేట రమణమూర్తి గారు , ఎస్ ఐ దండేపల్లి తాహేశీనుద్దీన్,లక్షెట్టిపేట సురేష్, ఎస్ ఐ జన్నారం అనూష , హెడ్ కానిస్టేబుళ్లు గౌస్, గంగ నాయక్, వసంత్, జహీర్, ఆనంద్ మరియు కానిస్టేబుళ్లు లను డీసీపీ గారు అభినందించారు.





