Thursday, March 19, 2026

చిన్నారులకు ఆట, పాట,కథలతో విద్యాబోధన అందించాలి-నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి-సిడిపిఓ ఆర్.మమత

నేటిసాక్షి, మిర్యాలగూడ : అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు ఆట, పాట కథలు చెప్తూ, పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా విద్య బోధన చేయాలని మిర్యాలగూడ అర్భన్ సిడిపిఓ మమత అన్నారు. అర్భన్ ప్రాజెక్ట్ పరిధిలోని చిల్లాపురం సెక్టార్ పరిధిలోని లావుడి తండాఅంగన్వాడీ కేంద్రంలో, ఈసిసిఈ డే కార్యక్రమంలో శనివారం అర్భన్ సిడిపిఓ ఆర్.మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసిసిఈ గురించి, అంగన్వాడీ టీచర్స్, చిన్నారులకు వివరించారు. పిల్లలు తయారుచేసిన డ్రాయింగ్ బుక్స్ ను ప్రదర్శించి, అంగన్వాడీ కేంద్రంలో 4 కార్నర్స్ గురించి మరియు పిల్లల లోపపోషణ లోపం కు గురైన వారిని గుర్తించి, వారి పోషణ కొరకు బాలామృతం ప్లస్ ను పంపిణీ చేయడం జరుగుతుందని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం యొక్క లబ్ధిదారులు, తల్లిదండ్రులు మరియు సంరక్షకులతో.. పోషకాహార గురించి వివరించి, తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే వివిధ రకాల ప్రీ స్కూల్ కార్యక్రమాలను, సౌకర్యాలను గుర్తించి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం అనేది నిత్య జీవితంలో తగ్గించాలని, అదేవిధంగా పిల్లలకు జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వకూడదని వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ఆర్.వాణి, బ్లాక్ కో-ఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్ మంగతి, పార్వతి, రామలక్ష్మి, అంగన్వాడీ ఆయా సోమ్లి, కిషోరబాలికలు,లబ్ధిదారులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News